![]() |
![]() |

ఢీ ప్రీమియర్ లీగ్ గ్రాండ్ ఫినాలే ఆడియన్స్ ని బాగా అలరించింది. ఇందులో హైదరాబాద్ ఉస్తాద్స్ గ్రీష్మ మాస్టర్ వార్సెస్ సైరా రాయలసీమ ప్రభు మాస్టర్ మధ్య గట్టి పోటీ జరిగింది. అన్ని రకాల రౌండ్స్ లో ఈ రెండు టీమ్స్ పోటాపోటీగా పెర్ఫార్మ్ చేశాయి. గ్రీష్మ మాస్టర్ హీరో నాని విన్నింగ్ టైటిల్ తో పాటు కాష్ ప్రైజ్ 75 లక్షలు అందించారు. ఇక చివరిగా నాని కొన్ని మాటలు వీళ్లకు చెప్పారు. "మీరు స్క్రీన్ మీద చాలామంది డాన్స్ చేయడాన్ని చూసి చాల ఇన్స్పైర్ అయ్యి ఈ స్టేజి మీద డాన్స్ చేసి ఉంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా కదా మీకంటే కూడా వాళ్ళెవరూ అంత బాగా చేయలేదు. ఇక గ్రీష్మ గురించి ప్రభుదేవా మాస్టర్ కూడా కొన్ని విషయాలు చెప్పాడు "గ్రీష్మ టైటిల్ విన్ ఐనందుకు చాల సంతోషంగా ఉంది.
మేమిద్దరం కలిసి ఢీ జోడిలో చేసాం. గ్రీష్మ చాల కష్టపడుతుంది. ఇక షో స్టార్టింగ్ లో నానిని రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగాడు హోస్ట్ ప్రదీప్ "ఇంట్లో మీరు వంట చేసి ఎవరైనా తినగలిగే ఐటెం ఏమిటి" అనేసరికి " ఆ నమ్మకం లేకే ఇంతవరకు వంట చేయలేదు. ఒకవేళ చేయాల్సి వస్తే వేరుశెనగగుళ్ళను ఉడకపెట్టడం నేను ఒక్కడినే చేస్తాను" అన్నాడు. "మలయాళంలో అమ్మాయిలంతా మిమ్మల్ని బావ అని పిలుచుకుంటారు" అనేసరికి నాని ఆన్సర్ చెప్పకుండా ఇదేదో ఆడియన్స్ అడిగిన ప్రశ్నల్లా లేవు అని కౌంటర్ ఇచ్చాడు. ఇలా ఆది కూడా శేఖర్ మాస్టర్ ని కొన్ని ప్రశ్నలు అడిగి ఎంటర్టైన్ చేసాడు. ఇలా ఈ వారంతో ఢీ సీజన్ 16 ముగిసింది.
![]() |
![]() |